పేదల క‌డుపులు కొట్టి పెద్ద‌ల‌కు పంచ‌డ‌మే బీజేపీ ఎజెండా : మాజీ ఎమ్మెల్యే జూల‌కంటి రంగారెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, నేరేడుచ‌ర్ల : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల కడుపు కొడుతూ పెద్దలకు పంచడమే ఎజెండాగా మారిందని రైతులకు కూలీలకు కార్మికులకు మహిళలకు ఎలాంటి ఉపయోగం లేని చట్టాలు చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.

పేదల క‌డుపులు కొట్టి పెద్ద‌ల‌కు పంచ‌డ‌మే బీజేపీ ఎజెండా : మాజీ ఎమ్మెల్యే జూల‌కంటి రంగారెడ్డి
X

దిశ‌, నేరేడుచ‌ర్ల : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల కడుపు కొడుతూ పెద్దలకు పంచడమే ఎజెండాగా మారిందని రైతులకు కూలీలకు కార్మికులకు మహిళలకు ఎలాంటి ఉపయోగం లేని చట్టాలు చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం నేరేడుచర్లలోని సీపీఎం నేత దామినేని బోసు 42వ వర్ధంతి సభ పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం శ్రామిక వర్గాన్ని రైతులను కూలీలను మహిళలను విస్మరిస్తుందని సంపదకు కారణమైన శ్రామిక వర్గం రైతులు కూలీలు అలాంటి వారు నేడు అనేక కష్టాలపాలై వీధిన పడే పరిస్థితి నెలకొందనీ అన్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కార్పొరేట్ సంస్థలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. రాజకీయాలలో ఓట్లు సీట్లు కూడా చట్టసభల్లో నేడు 50 కోట్లు ఖర్చుపెట్టిన వ్యక్తి ఎమ్మెల్యేగా 100 కోట్లు ఖర్చుపెట్టిన వ్యక్తి ఎంపీ గా చలామణి అవుతున్నారని ఆయన మండిపడ్డారు.


రాష్ట్రం ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పులో ఉందని దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 200 లక్షల కోట్ల అప్పులో ఉందని ప్రభుత్వాలు తక్కువ జనాభా ఉన్న వారి ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందని కార్పొరేట్ శక్తులకు కొమ్ముకోస్తుందని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు పారెప‌ల్లి శేఖ‌ర్ రావు, కాంగ్రెస్ అధ్య‌క్షులు కొణతం చిన్న వెంక‌ట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయ‌కులు శ్రీధ‌ర్, చిత్త‌లూరి సైదులు, ప‌ల్ల‌య్య‌, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్య‌క్షులు అంబ‌టి నాగ‌య్య‌, టీడీపీ మండ‌ల అధ్య‌క్షులు పోనుగొటి జంగారావు, జిల్లా కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్, కందగట్ల అనంత ప్రకాష్, మండల కార్యదర్శి సిరికొండ శ్రీను, సీఐటీయూ మండల కన్వీనర్ లీల రామ్మూర్తి కుంకు తిరుపతయ్య అనేగంటి మీనయ్య ఎస్.కె ఆఫీజ్ పాతూరి శ్రీనివాసరావు కట్ట మధుబాబు మామిడి నాగ సైదులు గుర్రం ఏసు, లింగయ్య, సట్టు కోటయ్య పాల్గొన్నారు.

Next Story