ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేత

by Bhanu |

చిట్యాల పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి 65 పై జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కోరుతూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్.. నల్గొండ కేంద్రంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేత
X

దిశ, చిట్యాల: చిట్యాల పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి 65 పై జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్.. నల్గొండ కేంద్రంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. జాతీయ రహదారి 65 పై ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమై నెలలు గడుస్తున్నప్పటికీ బ్రిడ్జి నిర్మాణ పూర్తి కావడం లేదని.. దీంతో పట్టణ ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే పనులను వేగవంతం చేసి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కన్నెబోయిన మాలింగం, శీను, కన్నెబోయిన మురళీకృష్ణ, తదితర నాయకులు ఉన్నారు.

Next Story