- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైకును ఢీ కొట్టిన ట్యాంకరు.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు
బంధువుల పెళ్లికి బైకుపై వెళ్తున్న వారిని ట్యాంకర్ ఢీకొనడంతో గూడూరు బుచ్చిరెడ్డి (59) అనే రైతు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.

దిశ, చౌటుప్పల్ టౌన్: బంధువుల పెళ్లికి బైకుపై వెళ్తున్న వారిని ట్యాంకర్ ఢీకొనడంతో గూడూరు బుచ్చిరెడ్డి (59) అనే రైతు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని అల్లాపురం గ్రామానికి చెందిన గూడూరు బుచ్చిరెడ్డి, ఫకీర్ అల్వాల్ రెడ్డి అనే ఇద్దరు రైతులు చౌటుప్పల్ లో జరిగే బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు ఇంట్లో నుంచి బైకుపై బయలుదేరారు. చౌటుప్పల్ లోని ఎస్ఎంరెడ్డి గార్డెన్స్ లో జరిగే వివాహానికి వెళ్తుండగా వలిగొండ రోడ్డులోని భారత్ పెట్రోల్ బంక్ దగ్గరికి చేరుకోగానే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ట్యాంకరు వీరి బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గూడూరు బుచ్చిరెడ్డి రోడ్డుమీద పడిపోగా.. ట్యాంకరు ఆయన తల పైనుంచి వెళ్లడంతో బుచ్చిరెడ్డి తల చిధ్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. అతని వెంటే ఉన్న పకీరు ఆల్వాల్ రెడ్డి కి గాయాలయ్యాయి. క్షతగాత్రుడు ఆల్వాల్ రెడ్డిని ప్రాథమిక చికిత్సల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బుచ్చిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ మన్మధకుమార్ తెలిపారు.






