ఎడ్ల బండిని ఢీకొన్న బైక్.. వ్యక్తి దుర్మరణం

by Bhanu |   (  Updated:2025-06-24 14:59:38  IST  )

నల్లగొండ జిల్లా మోత్కూరు మండలంలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాటిమట్ల గ్రామంలోని మల్లన్న గుడి సమీపంలో బైక్ ఎడ్ల బండిని వెనక నుంచి ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

ఎడ్ల బండిని ఢీకొన్న బైక్.. వ్యక్తి దుర్మరణం
X

దిశ, మోత్కూరు: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలంలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాటిమట్ల గ్రామంలోని మల్లన్న గుడి సమీపంలో బైక్ ఎడ్ల బండిని వెనక నుంచి ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

పోలీసులు , ప్రత్యక్షసాక్షుల వివరాల ప్రకారం.. అడ్డగూడూరు మండలం గోవిందపురం గ్రామానికి చెందిన చుక్క రాకేష్ మోత్కూరు నుండి స్వగ్రామానికి బయలుదేరి వెళ్తుండగా మార్గమధ్యంలో వేగంగా ఉన్న బైక్‌ను ఒక ఎడ్లబండి వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాకేష్‌ తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచినట్లు సమాచారం.

బైక్‌పై రాకేష్‌తో పాటు ఉన్న మరో వ్యక్తికి గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. అతని ఆరోగ్య పరిస్థితిపై ఇంకా పూర్తిస్థాయిలో సమాచారం అందాల్సి ఉంది. ఘటనపై మోత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story