- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదవశాత్తు వలస కార్మికుడు మృతి
ప్రమాదవశాత్తు ఓ వలస కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామంలో గల ఇంద్రకీలాద్రి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

దిశ, భూదాన్ పోచంపల్లి: ప్రమాదవశాత్తు ఓ వలస కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామంలో గల ఇంద్రకీలాద్రి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన కుమోద్ కుమార్ (19) రైస్ మిల్లులో 10 రోజులుగా పనిచేస్తున్నారు. అయితే మిల్లులోని గొట్టపు పైపులో తవుడు జామ్ కావడంతో దానిని తొలగించేందుకు పక్కనే ఉన్న పార సహాయంతో గొట్టపు పైపును గట్టిగా కొట్టాడు.
దీంతో పైపు పగిలి పైన ఉన్న ఇనుప రేకులు ఒక్కసారిగా కుప్పకూలి అతనిపై పడడంతో తలకు, చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే కుమోద్ కుమార్ ను హైదరాబాదులోని హయత్ నగర్ వివేరా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు రాజు కుమార్ యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.






