భూభారతి నిధులు పక్కదారికి.. ఏడుగురి పై కేసు నమోదు

by Nallavelli.Anjaneyulu |

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ భూభారతి స్టాంపు డ్యూటీ నిధులు పక్క దారి పట్టించిన స్కాం లో రాజాపేట తహసిల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు అయిన వాటికి స్లాట్ బుక్ చేసిన 12 మంది డాక్యుమెంట్ రైటర్ల హస్తం ఉన్నట్టు మంగళవారం రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది.

భూభారతి నిధులు పక్కదారికి.. ఏడుగురి పై కేసు నమోదు
X

దిశ, రాజాపేట: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ భూభారతి స్టాంపు డ్యూటీ నిధులు పక్క దారి పట్టించిన స్కాం లో రాజాపేట తహసిల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు అయిన వాటికి స్లాట్ బుక్ చేసిన 12 మంది డాక్యుమెంట్ రైటర్ల హస్తం ఉన్నట్టు మంగళవారం రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. అధికారుల లెక్క ప్రకారం ముగ్గురు స్థానికులు, స్థానికేతరులు12 మంది డాక్యుమెంట్ రైటర్ల నుంచి 344 రైతులు రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. ఇందులో ప్రభుత్వానికి చలాన రూపంగా రూ.72,31,827 లక్షలకు గాను రూ.4,31,098 లక్షలు చెల్లించి, మిగతా రూ. 68, 11,729 లక్షలు స్వాహా చేసినట్లు తేలింది. వీరిలో బొందుగుల చెందిన గోపగాని శ్రీనాథ్ 15 డాక్యుమెంట్లకు గాను రిజిస్ట్రేషన్ చాలను రూ. 4,98 లక్షలకు రూ. 25, 256 చెల్లించాడు. బేగంపేట చెందిన జెల్ల పాండు 179 డాక్యుమెంట్లకు గాను రూ. 32, 69, 668 లక్షల చాలానుకు గాను రూ. 1, 46 లక్షలు, అదే గ్రామానికి చెందిన జెల్ల పావని 99 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లకు గాను రూ. 33, 69,668 లక్షలకు రూ. 84,899 వేలు చెల్లించినట్లు నిర్ధారించారు. బి అశోక్ 1 డాక్యుమెంట్ గాను రూ. 4, 64 లక్షలకు రూ. 83 వేలు, దాసరి శ్రీకాంత్ 3 డాక్యుమెంట్లకు రూ. 1, 25 లక్షలకు రూ. 1833, హరికృష్ణ 4 డాక్యుమెంట్ గాను రూ. 39 వేలకు రూ.14,348 వందలు, నారా భాను 21 డాక్యుమెంట్ల కు 1, 45 లక్షలకు రూ. 16, 655, పసునూరి బస్వరాజ్ 20 డాక్యుమెంట్లకు రూ. 2, 65 లక్షలకు రూ. 14,558 వేలు, సుంచు పవన్ కుమార్ 1 డాక్యుమెంట్ గాను రూ. 34, 201 లక్షల గాను రూ. 12, 173 వేలు, రేయన్స్ 2 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లకు రూ. 73, 312 వేల చలాన చెల్లించాల్సి ఉండగా రూ. 732 చెల్లించారు. ఈ 12 మంది కలిసి మొత్తం రూ. 68,11, 727 లక్షలు స్వాహా చేసినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. భూభారతి లో అవినీతికి పాల్పడ్డ ఏడుగురి పై రాజాపేట ఇంచార్జ్ తహసిల్దార్ ప్రదీప్ స్థానిక పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు. పాండు, పావని, భాను, శ్రీనాథ్,శ్రీకాంత్ ,రియాన్స్ బసవరాజు ల మీద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Next Story