భువనగిరి ఆర్టీఏ కార్యాలయంలో ప్రమాదం...

by Bhanu |

భువనగిరి ఆర్టీఏ కార్యాలయంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ బస్సు ఫిట్ నెస్ కోసం వచ్చిన సమయంలో ఈ ఘటనలో జరిగింది.

భువనగిరి ఆర్టీఏ కార్యాలయంలో ప్రమాదం...
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి ఆర్టీఏ కార్యాలయంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ బస్సు ఫిట్ నెస్ కోసం వచ్చిన సమయంలో ఈ ఘటనలో జరిగింది. బొమ్మలరామారం మండలం మర్యాలకు చెందిన కొండ్ర భాను ప్రైవేట్ బస్సు ఫిట్ నెస్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో బస్సును రివర్స్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు క్యాబిన్ కు పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలాయి.

దీంతో బస్సు నడుపుతున్న డ్రైవర్ కు విద్యుత్ షాక్ తగిలింది‌. వెంటనే గమనించిన కార్యాలయానికి వచ్చిన ప్రజలు అప్రమత్తమై భానును చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జిల్లా స్థాయి కార్యాలయంలో నిత్యం ప్రైవేట్ వాహనాలు రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్ కోసం వస్తుంటాయి. ఇట్లాంటి బస్సులు వచ్చే క్రమంలో కూడా వాటికి తగిలేలా విద్యుత్ వైర్లు ఉండడంతో ఇట్లాంటి ఘటన చోటుచేసుకుందని, సంబంధించిన శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుందని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.





Next Story