విద్యార్థినీలకు బ్యూటీ అండ్ వెల్నెస్ సమ్మర్ ఇంటర్న్ షిప్ పూర్తి

by Bhoopathi Nagaiah |

తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ (గుండ్లపల్లి) విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన సమ్మర్ ఇంటర్న్ షిప్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

విద్యార్థినీలకు బ్యూటీ అండ్ వెల్నెస్ సమ్మర్ ఇంటర్న్ షిప్ పూర్తి
X

దిశ, చింతపల్లి(డిండి) : తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ (గుండ్లపల్లి) విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన సమ్మర్ ఇంటర్న్ షిప్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఒకేషనల్ విద్యలో భాగంగా బ్యూటీ అండ్ వెల్నెస్ ట్రేడ్‌కు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థినీలకు ఈ శిక్షణను అందించారు. ఈ ఇంటర్న్ షిప్ కార్యక్రమం గుండ్లపల్లిలోని షాను మేకప్ స్టూడియోలో నిర్వహించబడింది. పాఠశాల ప్రిన్సిపాల్ నారాయణ రెడ్డి మార్గదర్శకత్వంలో వొకేషనల్ ట్రైనర్ పి ధనలక్ష్మి ప్రత్యక్ష పర్యవేక్షణలో విద్యార్థులు శిక్షణ పొందారు. కేవలం థియరీకే పరిమితం కాకుండా, విద్యార్థులు మేకప్, స్కిన్ కేర్ మరియు ఇతర బ్యూటీ సర్వీసులలో వృత్తిపరమైన మెళకువలను, ప్రాక్టికల్ నైపుణ్యాలను నేర్చుకున్నారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. చదువుతో పాటు వృత్తి విద్యా నైపుణ్యాలు ఉంటేనే నేటి పోటీ ప్రపంచంలో స్థిరపడగలరని ఆకాంక్షించారు. ఈ శిక్షణ ద్వారా పొందిన అనుభవం విద్యార్థులకు భవిష్యత్తులో స్వయం ఉపాధి మరియు ఇతర ఉద్యోగ అవకాశాలకు ఎంతో దోహదపడుతుందని వొకేషనల్ ట్రైనర్ పి ధనలక్ష్మి పేర్కొన్నారు. అత్యంత ఉత్సాహంతో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులను పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు అభినందించారు.

Next Story