- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై భాస్కర్ రెడ్డి
సైబర్ నెరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోచంపల్లి ఎస్సై భాస్కర్ రెడ్డి అన్నారు.

దిశ, భూదాన్ పోచంపల్లి : సైబర్ నెరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోచంపల్లి ఎస్సై భాస్కర్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలో నేతాజీ చౌరస్తాలో పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ఉద్యోగాలు, లోన్లు వంటివి ఇప్పిస్తామని ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే నమ్మవద్దని సూచించారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా యువత మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, గంజాయి, మత్తు పదార్థాలు సేవించే అనుమానాస్పద వ్యక్తులు కనబడితే డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్ నాయక్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, రమేష్, పోలీసు సిబ్బంది వినోద్, శివ, అంకిత, సరస్వతి పాల్గొన్నారు.






