- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో.. "ఆధిపత్య పోరు"
దిశ, తిరుమలగిరి (సాగర్) : మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్టు కనపడుతుంది. ఆయా పార్టీ నాయకులు, పీఏసీఎస్, ఐకెపి అధికారులతో

దిశ, తిరుమలగిరి (సాగర్) : మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్టు కనపడుతుంది. ఆయా పార్టీ నాయకులు, పీఏసీఎస్, ఐకెపి అధికారులతో కలసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వేర్వేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇందిరా క్రాంతి పథకంలో భాగంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం అల్వాల్ గ్రామంలో,మంగళవారం మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ఐకెపి కేంద్రాలను అధికారులు,మండల కాంగ్రెస్ నాయకులతో కలసి ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి ప్రారంభించగా.. అప్పటికే సోమవారం రాజవరం, కొంపెల్లి గ్రామాలలో పీఏసీఎస్సీ ఆధ్వర్యంలో పీఏసీఎస్ అధికారులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కోటిరెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. బుధవారం రాజవరం గ్రామంలో పీఏసీఎస్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం పరిసర ప్రాంతంలోనే ఐకెపి ఆధ్వర్యంలో మరో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి ప్రారంభించారు. దీంతో రాజవరం, కొంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇరు పార్టీల మధ్య "ఆధిపత్య పోరు" నడుస్తుందన్నట్టు ఆ ప్రాంతంలోని రైతుల మధ్య చర్చ సాగడం చర్చనీయాంశమైంది.






