చదువు ఉందంటే… నీళ్లు ఉండకపోవచ్చు!

by Bhanu |

"కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు!" అని ప్రకటిస్తున్న పాలకుల మాటలు గ్రౌండ్ రియాలిటీలో మాత్రం పూర్తిగా వేరే

చదువు ఉందంటే… నీళ్లు ఉండకపోవచ్చు!
X

దిశ, చివ్వేంల: "కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు!" అని ప్రకటిస్తున్న పాలకుల మాటలు గ్రౌండ్ రియాలిటీలో మాత్రం పూర్తిగా వేరే రూపం చూపిస్తున్నాయి. చివ్వేంల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమవుతుండగానే విద్యార్థులకు సమస్యల మోత మోగుతోంది. తాగునీటి లభ్యత లేకపోవడం, మరుగుదొడ్లలో నీరు రాక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొందిపాఠశాలల్లో వాటర్ ట్యాంకులు ఉండేను కానీ వాటికి కలెక్షన్ లేకపోవడంతో ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది. ఇక మధ్యాహ్న భోజనం తర్వాత చేతులు కడుక్కోవడానికి నీళ్లు లేకపోవడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.

"అమ్మ ఆదర్శ పాఠశాల" పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులు ఇంకా పూర్తి కాలేదని తల్లిదండ్రులు తెలిపారు. ముఖ్యంగా మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి ఏర్పాట్లు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మండలంలో అమ్మఆదర్శ పాఠశాల పెండింగ్ పనులను వీలైనంత తొందరగా పూర్తి చేయించి పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలకుండా చూస్తామని ఎంపీడీవో సంతోష్ కుమార్ 'దిశ'కు వివరణ ఇచ్చారు.

Next Story