- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొర్రెలు, మేకల పెంపకం దారులకు అవగాహన
దిశ, రాజాపేట : శీతాకాలంలో గొర్రెలకు మేకలకు ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పెంపకం దారులకు శుక్రవారం అవగాహన నిర్వహించారు. రాజపేట మండలంలోని

దిశ, రాజాపేట : శీతాకాలంలో గొర్రెలకు మేకలకు ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పెంపకం దారులకు శుక్రవారం అవగాహన నిర్వహించారు. రాజపేట మండలంలోని బొందుగుల గ్రామంలో గొర్రెల మేకల పెంపకదారుల అవగాహన సదస్సు పశు సంవర్ధక శాఖ, ఇంటాస్ ఫార్మ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. శీతాకాలంలో గొర్రెలకు మేకలకు ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చలి కాలంలో మేకలను, గొర్రెలను అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకు ఏవిధంగా రక్షించుకోవాలి, గొర్రెలను మేకలను ఎలాంటి గడ్డి రకాలు పెంచుకొని వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనే విషయాలను గురించి వివరించారు. ఈ అవగాహన సమావేశంలో మండల పశు వైద్యాకారి డాక్టర్. ఎం. చంద్రారెడ్డి, తుర్కపల్లి మండల పశు వైద్యాధికారి డాక్టర్ ఆర్. రామచంద్రారెడ్డి,ఇంటాస్ ఏరియా మేనేజర్ బుచ్చయ్య, శ్రీనివాసరెడ్డి, కే. సిద్దులు,మహేష్, తిప్పర్తి శ్రీకాంత్, భానుచందర్, అజయకుమార్ పాల్గొన్నారు.






