మేళ్లచెరువులో ఆటో బోల్తా.. మహిళ మృతి

by Ratna Kumari |

మేళ్ల చెరువులో ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. ఆటో బోల్తా ప‌డ‌టంతో ఓ మ‌హిళా మృతి చెంద‌డంతో పాటు మ‌రో న‌లుగురు వ్య‌క్తుల‌కు గాయాల‌య్యాయి.

మేళ్లచెరువులో ఆటో బోల్తా.. మహిళ మృతి
X

దిశ, మేళ్లచెరువు : మేళ్ల చెరువులో ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. ఆటో బోల్తా ప‌డ‌టంతో ఓ మ‌హిళా మృతి చెంద‌డంతో పాటు మ‌రో న‌లుగురు వ్య‌క్తుల‌కు గాయాల‌య్యాయి. ఈ సంఘ‌ట‌న మేళ్ల చెరువు మండ‌ల ప‌రిధిలోని హుజూర్ న‌గ‌ర్ ఎక్స్ రోడ్డు పెట్రోల్ బంక్ స‌మీపంలో చోటు చేసుకుంది. ఆటో డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం.. అతి వేగ‌మే ప్ర‌ధాన కార‌ణం అని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కోదాడ మండ‌లం గ‌ణ‌ప‌వ‌రం గ్రామానికి చెందిన పెంటి వెంక‌ట‌ర‌మ‌ణ‌(59) కూలీ. అదే గ్రామానికి చెందిన మ‌రికొంద‌రూ మ‌హిళ‌ల‌తో క‌లిసి రేవూరు గ్రామానికి వ‌రి పొలం నాటు కూలి ప‌నుల నిమిత్తం బ‌య‌లుదేరారు. అదే గ్రామానికి చెందిన న‌ర‌ల‌శెట్టి ఉపేంద‌ర్ ఆటో డ్రైవ‌ర్. TG 29 T 4835 నెంబ‌ర్ గ‌ల ఆటోలో ప్ర‌యాణిస్తుండ‌గా.. మార్గ మ‌ధ్య‌లో మేళ్లచెరువు కేంద్రంలోని హుజూర్‌నగర్ ఎక్స్‌రోడ్ సమీపానికి రాగానే, ఆటో డ్రైవర్ ఆటోను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతో అదుపు తప్పి ఓవర్‌టర్న్ అయింది. ఈ ప్రమాదంలో పెంటి వెంకట రమణ ఆటో నుంచి కిందపడుతూ తల వెనుక భాగంలో తీవ్ర రక్తగాయం కావడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో ప‌ల‌పాటి మంగ‌మ్మ ఎడ‌మ కాలికి గాయ‌మైంది. జ‌బిశెట్టి స‌క్కుబాయి త‌ల‌కు గాయం, కంప‌శెట్టి లింగ‌మ్మ‌, జంగం ల‌క్ష్మ‌మ్మ‌ల‌కు స్వ‌ల్ప గాయాలు అయ్యాయని పోలీసులు వెల్ల‌డించారు. మృత‌దేహాన్ని హూజూర్ న‌గ‌ర్ ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్సై ప‌ర‌మేష్ తెలిపారు.

Next Story