రెండు ఆటోలు ఎదురెదురు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

by Bhanu |

రెండు ఆటోలు ఎదురుగా ఢీకొట్టిన సంఘటన శనివారం రాత్రి ఆలేరు శివారులోని హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో చోటుచేసుకుంది.

రెండు ఆటోలు ఎదురెదురు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
X

దిశ, ఆలేరు టౌన్: రెండు ఆటోలు ఎదురుగా ఢీకొట్టిన సంఘటన శనివారం రాత్రి ఆలేరు శివారులోని హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో చోటుచేసుకుంది. ఆలేరు ఎస్ హెచ్ ఓ కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం. జనగాం జిల్లా లింగాల గణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన చింత ప్రభాకర్, లక్ష్మి, అన్నపూర్ణమ్మ, హైదరాబాదులోని బంధువుల పెళ్లికి వెళ్తుండగా శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆలేరు పట్టణంలోని హెచ్ పి పెట్రోల్ బంక్, చౌదరి దాబా దగ్గర జనగాం నుండి హైదరాబాద్ కు వెళ్తున్న ఆటోను ఆలేరు పట్టణానికి చెందిన నల్ల గోని శ్రీనివాస్ ఆటో ఆలేరు నుండి జనగాం వైపు వెళ్తున్న క్రమంలో వారికి ఎదురుగా వెళ్లి ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయి. అందులో చింత లక్ష్మికి కాలు విరిగింధి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో జనగాం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చింత వెంకటేష్ ఇచ్చిన పిటిషన్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ లు తెలిపారు.




Next Story