- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కత్తితో స్కూల్ వాచ్ మెన్ పై దాడి
దిశ, నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లా కేంద్రంలో లిటిల్ ఫ్లవర్ పాఠశాల వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పండ్లు కోసే కత్తితో స్కూల్ వాచ్ మెన్ పై ఓ చిరు వ్యాపారి దాడి చేశాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన

దిశ, నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లా కేంద్రంలో లిటిల్ ఫ్లవర్ పాఠశాల వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పండ్లు కోసే కత్తితో స్కూల్ వాచ్ మెన్ పై ఓ చిరు వ్యాపారి దాడి చేశాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వినయ్ అనే వ్యక్తి తోపుడు బండిపై పండ్లు విక్రయించుకునేవాడు. తోపుడు బండి స్కుూల్ ఎదుట పెట్టడంతో, స్కూల్ వాచ్ మెన్ పక్కకు తీయాల్సిందిగా సూచించాడు. దీంతో కోపోద్రిక్తుడైన వినయ్ పండ్లు కోసే కత్తితో వాచ్ మెన్ పై దాడి చేశాడు. దీంతో అది చేతి వేళ్లకు తగలడంతో ప్రాణపాయం తప్పి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు వ్యాపారం చేసుకుంటూ, ప్రజలను భాయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానిక ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చే వారిపై పటిష్టమైన నిఘా ఉంచాలని స్థానికులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.






