- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై దాడి
నల్గొండ(Nalgonda) మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Kancharla Bhupal Reddy)పై దాడి జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : నల్గొండ(Nalgonda) మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Kancharla Bhupal Reddy)పై దాడి జరిగింది. మున్సిపల్ కార్యాలయంలో కేటీఆర్ ఫ్లెక్సీలు(KTR Flexy) తొలగించడంతో కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడే ఉన్న కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు భూపాల్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకొని, పూలకుండీలు విసురుకున్నారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి అనుచరులు, నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పథకం ప్రకారమే తమపై దాడి చేయించారన్నారు. గూండాల్లగా ఆయుధాలతో తమపై దాడికి దిగడమే కాకుండా.. విచక్షణ మరిచి మహిళలను వివాదంలోకి లాగుతున్నారని ఆయన మండిపడ్డారు. కాగా ఈ ఘటనలో భూపాల్ రెడ్డి సహ పలువురు బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు.






