థార్ గ్యాంగ్ ముఠా సభ్యుడి అరెస్టు

by Ratna Kumari |

బస్సులో బంగారు అభరణాలు చోరీ చేసే థార్ గ్యాంగ్ లోని ఓ సభ్యుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

థార్ గ్యాంగ్ ముఠా సభ్యుడి అరెస్టు
X

దిశ, నల్లగొండ క్రైం : బస్సులో బంగారు అభరణాలు చోరీ చేసే థార్ గ్యాంగ్ లోని ఓ సభ్యుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఐదు రోజుల పాటు మధ్యప్రదేశ్ థార్ జిల్లాను జల్లెడపట్టి నేరస్థుడిని పట్టుకుని జిల్లాకు తీసుకొచ్చారు. నల్లగొండ డీపీవోలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 5వ తేదీన చిట్యాల పోలీసు స్టేషన్ పరిధిలో ఎన్ఎల్ 01 బీ2 2756 నెంబరు గల బస్సులో భారీ మొత్తంలో బంగారు ఆభరణాల చోరీ జరిగింది. ఈ కేసును సవాల్ గా తీసుకుని నల్లగొండ జిల్లాపోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సీసీ‌ఎస్, ఇన్స్ పెక్టర్ ఎం.జితేందర్ రెడ్డి పర్యవేక్షణలో కేసును ఛేదించటానికి వివిధ ప్రాంతాలలో పర్యటించారు. ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, నిందితులు మధ్యప్రదేశ్ రాష్ట్రం థార్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ రెండు ప్రత్యేక బృందాలను మధ్యప్రదేశ్ రాష్ట్రనికి పంపారు.

నేరస్తులపై ప్రత్యేక నిఘా..

15 రోజుల పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యాటించి నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచి ఆ రాష్ట్రంలోని మనవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమర్భాన్ క్రాస్ రోడ్డు వద్ద షా అల్లా రఖా అనే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, అతడు తన సహచరులు అష్రఫ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, జాబర్ ఖాన్, ఉమర్ ఖాన్లతో కలిసి బస్సుదోపిడీ చేసినట్లుగా ఒప్పుకున్నాడు. కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో హైవేలపై ప్రయాణించే బస్సులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించాడు. గతంలో కూడా ముఠా 2022, 2023 సంవత్సరం లో విజయవాడ హైవే పై ఇవే ప్రదేశాలలో హోటల్ ల వద్ద ఆగి ఉన్న బస్సు నుంచి భారీ మొత్తంలో డబ్బుల, బంగారు ఆభరణాలను దొంగలించారు. నిందితుడి నుండి రూ.85 లక్షల విలువైన 60తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గఇట్టి ముఠా సభ్యులను గతంలో చేసిన పాతనేరాలను వెలికితీసి సమగ్ర విచారణ కై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగినది సీసీ‌ఎస్ ఇన్స్ పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి, చిట్యాల సీఐ నాగరాజు, సీసీఎస్ ఎస్ఐ శివ కుమార్, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన గిరి, పుష్పగిరి, నాగరాజు, కానిస్టేబుల్స్ వెంకటేష్, సాయికుమార్ , జూనేద్, శివరాజు, మహేశ్, కమల్ కిశోర్, చిన్న బాబు, ఇతర సిబ్బందిని ఎప్.పి అభినందించి రివార్డును ప్రకటించారు.

Next Story