- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశామని చీఫ్ సూపరీండెంట్లు నవీన్ కుమార్, జ్యోతి అన్నారు.

X
దిశ,భూదాన్ పోచంపల్లి: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశామని చీఫ్ సూపరీండెంట్లు నవీన్ కుమార్, జ్యోతి అన్నారు. ఈ సందర్భంగా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణగిరిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో, పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపటి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు రెండు సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం 262 విద్యార్థులు, తెలంగాణ మోడల్ స్కూల్ లో 309 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుందని , విద్యార్థిని విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి రావాలని కోరారు.
Next Story






