ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సర్వ సిద్ధం..

by Naveena |

రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వణకు అధికారులు మండల కేంద్రంలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సర్వ సిద్ధం..
X

దిశ, నడిగూడెం : రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వణకు అధికారులు మండల కేంద్రంలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో 203 మంది విద్యార్థులు ,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 207 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని చీఫ్ సూపరింటెండెంట్ లు చింతలపాటి వాణి, శ్రీధర్ తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని వాచీలు విద్యార్థులు పెట్టుకొని రావద్దని పేర్కొన్నారు. విద్యార్థులు హాల్ టికెట్స్ తప్పనిసరిగా తీసుకొని పరీక్షకు హాజరు కావాలని, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు మంచినీరు విద్యుత్తు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

పరీక్షలు సీసీ కెమెరాలు నడుమ నిఘా నీడలో జరుగుతాయన్నారు. ఇన్విజిలేటర్లకు పరీక్షల నిర్వహణకు సంబంధించి సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించామన్నారు. రేపు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరము తెలుగు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు అన్ని సిద్ధం చేశామన్నారు. డిపార్ట్మెంట్ ఆఫీసర్లు రవి, రమేష్ పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని నడిగూడెం తహసీల్దార్ వాసిమళ్ల సరిత మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పరీక్ష నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను చీఫ్ సూపరింటెండెంట్ లను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఆర్ ఐ గోపాలకృష్ణ పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 5 వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కొనసాగనున్న నేపధ్యంలో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులో వుంటుందని స్థానిక ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని గురుకుల జూనియర్ కళాశాల, కెఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో జరగనున్నాయి. కావున ఆయా ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లను పరీక్ష జరిగే సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మూసివేయాలని సూచించారు.

Next Story