నాట్లు వేసిన అందని రైతు భరోసా.. మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్ష‌మ‌య్య గౌడ్

by Nallavelli.Anjaneyulu |

యాసంగీలో రైతులు వరి నాట్లు వేశారని అయినా ప్రభుత్వం ఇప్పటికీ రైతు భరోసా నిధులు వారి ఖాతాలో జమ చేయలేదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ అన్నారు.

నాట్లు వేసిన అందని రైతు భరోసా.. మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్ష‌మ‌య్య గౌడ్
X

దిశ‌, రాజాపేట : యాసంగీలో రైతులు వరి నాట్లు వేశారని అయినా ప్రభుత్వం ఇప్పటికీ రైతు భరోసా నిధులు వారి ఖాతాలో జమ చేయలేదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ అన్నారు. ఆదివారం రాజాపేట మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సట్టు తిరుమలేష్ దంపతులు కు ఇటీవల చేతికి కాలిన తీవ్ర గాయాలు కాగా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సింగారం గ్రామ ఉప సర్పంచ్ కొవ్వూరి కర్ణాకర్ రెడ్డి మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడి సాయం లేక రైతులు మైక్రో ఫైనాన్స్ వద్ద అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి అవి తీర్చే మార్గం లేక అప్పులపాలు అవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అప్పులు ఎక్కువ అయి ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల వివరాలు ప్రభుత్వం వెల్లడించాలన్నారు. రెండున్నర ఏళ్లలో 420 హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లోను మోసానికి తెరలేపిందన్నారు. ప్రజలంతా గమనించి కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించాలని పిలుపునిచ్చారు.

Next Story