గుర్తు తెలియని శవం లభ్యం

by Ratna Kumari |

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యమైన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో

గుర్తు తెలియని శవం లభ్యం
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యమైన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సుమారు 11 గంటల సమయంలో భువనగిరిలో గల భైరవకుంట చెరువులో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం గుర్తించారు. చనిపోయిన వ్యక్తి శవం సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలదు. ఈ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ నందు సంప్రదించగలరు. భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ నంబర్ ను 8712662490 సంప్రదించాలని కోరారు.

Next Story