- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీళ్ల కుంటలో పడి వృద్ధురాలు మృతి..
by Batti.Sumithra |
మండల పరిధిలోని రేపాల గ్రామ శివారులో జగన్నాధపురం రోడ్డు పక్కన నీళ్ల కుంటలో పడిమతిస్థిమితం లేని ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది.

X
దిశ, మునగాల : మండల పరిధిలోని రేపాల గ్రామ శివారులో జగన్నాధపురం రోడ్డు పక్కన నీళ్ల కుంటలో పడిమతిస్థిమితం లేని ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నరసింహుల గూడెం గ్రామానికి చెందిన ఎస్కే కాశమ్మ(80) మతిస్థిమితం సక్రమంగా లేక ఏప్రిల్ 30న ఇంటి నుంచి ఎటో వెళ్లిపోవడంతో కుటుంబీకులు ఆమె కోసం వెతుకుతున్నారని తెలిపారు.
శనివారం ఉదయం రేపాల నుండి జగన్నాధపురం వెళుతున్న ప్రయాణికులు నీళ్ల కుంటలు తేలి ఆడుతున్న శవాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి వెళ్లి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలు కాశమ్మ అని నిర్ధారించుకొని బంధువులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై మల్సూర్ తెలిపారు.
Next Story






