- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతి వేగంతో కారును ఢీ కొట్టిన డీసిఎం.. వ్యక్తి మృతి
డీసిఎం డ్రైవర్ నిర్లక్ష్యం తో వ్యక్తి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలో ని వంగమర్తి గ్రామం లో చోటు చేసుకుంది.

దిశ, శాలిగౌరారం : డీసిఎం డ్రైవర్ నిర్లక్ష్యం తో వ్యక్తి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలో ని వంగమర్తి గ్రామం లో చోటు చేసుకుంది. శాలిగౌరారం ఎస్ ఐ డి.సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మామిడాల గ్రామానికి చెందిన కుర్ర శంకర్ మంగళవారం తెల్లవారుజామున మారుతీ ఆల్టో కార్ లో అర్వపల్లి వైపు వెళ్తున్నాడు. అయితే.. వంగమర్తి గ్రామ శివారు చేరే సమయంలో కారు వెనకాల వస్తున్న డీసిఎం డ్రైవర్ బాజీ నిర్లక్ష్యం తో అతి వేగంగా వచ్చి ఆల్టో కార్ ని ఢీ కొట్టాడు.
వేగంగా వచ్చి కారును ఢీ కొనడంతో ఆల్టో కార్ లో ఉన్న కుర్ర శంకర్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. మృతుడు కుర్ర శంకర్ కి భార్య మాధవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య కుర్ర మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ సైదులు తెలిపారు.






