ఐడి కార్డు ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతి : ఆర్డీఓ శ్రీనివాసులు

by Nallavelli.Anjaneyulu |

దిశ, హుజూర్ నగర్ : ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఈనెల 17న జరిగే హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ లో మూడో విడుత

ఐడి కార్డు ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతి : ఆర్డీఓ శ్రీనివాసులు
X

దిశ, హుజూర్ నగర్ : ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఈనెల 17న జరిగే హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ లో మూడో విడుత జరుగుతున్న సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలలో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు తమ వెంట ప్రభుత్వం గుర్తించిన ఫోటోతో కూడిన ఐడి కార్డులను తప్పనిసరిగా తీసుకురావాలని ఐడి కార్డు ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతి ఉంటుందని హుజూర్ నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన రంగాలలో ఫోటోతో కూడిన ఐడి కార్డు ఉంటే వాటికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. అందులో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, రేషన్ కార్డు, పింఛన్ కార్డులు, ఫోటోతో కూడిన కార్డులు ఉండాలని అలాగే వీటితో పాటు ఎన్నికల కోడ్ కంటే ముందు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు ఫోటోతో కూడిన కార్డులు చెల్లుతాయని తెలిపారు.

Next Story