- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో..
ఆలేరు- సిద్దిపేట వెళ్లే మధ్య కొలనుపాక బిక్కేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో రాస్తారోకో శుక్రవారం నిర్వహించారు.

దిశ, ఆలేరు టౌన్: ఆలేరు- సిద్దిపేట వెళ్లే మధ్య కొలనుపాక బిక్కేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో రాస్తారోకో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో బ్రిడ్జి మంజూరైనప్పటికీ నేటి ప్రభుత్వం నిర్మాణ పనులు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. వర్షాకాలంలో కురుస్తున్న వర్షాలు మూలంగా ఉధృతి పెరిగి ప్రజలకు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కొలనుపాక గ్రామం జలదిగ్బంధనంలో చిక్కుకుంటుందని, అత్యవసర పనులకు కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన చెప్పుకుంటున్న ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే నిర్మాణం జరగకముందే జరిగిందని వార్తా చానల్లో ప్రసారం చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేస్తున్న ప్రజల వద్దకు వచ్చి మద్దతు పలికి అధికారంలోకి రాగానే త్వరితగతిన పూర్తి చేస్తానని హామీలు గుప్పించిన శాసనసభ్యులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు.
గత రెండు రోజులు రాకపోకలు బందై ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కావున నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని గ్రామ చుట్టుపక్కల ఉన్న బ్రిడ్జిలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామంలోకి అడుగుపెట్టనీయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, గ్రామ మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మి ప్రసాద్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రామ కార్యదర్శి గడ్డం నాగరాజు, బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు మాసాపేట రాజు, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు జంగా స్వామి, మాజీ ఎంపీటీసీ మామిడాల అంజయ్య, ఆరే మల్లేశం, నాయకులు మామిడాల బాల మల్లేశం, మామిడాల భానుచందర్, పైసా రాందాస్, నీలా మురళి, తీరాల శంకర్ ,కోలా క్రాంతి ,మామిడాల ప్రవీణ్ ,ఎదునూరి భాస్కర్ ,సొంటెం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.






