నమ్మకానికి కుచ్చుటోపి.. కోటి అప్పుచేసి పరార్..!

by Bhanu |

నమ్మకస్తులకు కోటి రూపాయలు అప్పుచేసి రాత్రికి రాత్రి అడ్రస్సు లేకుండా వెళ్లిపోయిన వ్యక్తి సంఘటన ఆలేరు పట్టణంలో జరిగింది. మోత్కూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి 2018లో ఆలేరుకు వచ్చాడు.

నమ్మకానికి కుచ్చుటోపి.. కోటి అప్పుచేసి పరార్..!
X

దిశ, ఆలేరు టౌన్ : నమ్మకస్తులకు కోటి రూపాయలు అప్పుచేసి రాత్రికి రాత్రి అడ్రస్సు లేకుండా వెళ్లిపోయిన వ్యక్తి సంఘటన ఆలేరు పట్టణంలో జరిగింది. మోత్కూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి 2018లో ఆలేరుకు వచ్చాడు. ఒక కంపెనీకి చెందిన మోటార్ వాహనాల ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆలేరు పట్టణంలో నమ్మకంగా ఉంటూ చాలామందితో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలను తక్కువ ధరకు ఇప్పిస్తానని చాలామంది దగ్గర అడ్వాన్సు తీసుకున్నాడు.

అతని భార్య సైతం చిట్టిలు చేస్తూ పలువురి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు తెలిసింది. వచ్చిన ఆదాయం తీసుకున్న అప్పులను కొన్నింట్లో పెట్టుబడులు నష్టపోయినట్లు సమాచారం. అప్పుల పాలైన వ్యక్తి భార్యతో కలిసి వారం రోజుల కిందట రాత్రి వేళలో వెళ్లిపోయారని తెలుస్తోంది. వారం రోజులుగా సర్వీస్ సెంటర్ ను తెరవకపోవడంతో ప్రతి ఒక్కరికి అనుమానాలు కలుగుతున్నాయి. మూసి ఉన్న సర్వీస్ సెంటర్ దగ్గరికి వచ్చి కొందరు అడిగినట్లు తెలిసింది. సర్వీస్ సెంటర్లో పనిచేసిన వారికి రెండు మూడు నెలల జీతం ఇవ్వనున్నట్లు తెలిసింది.

వాహనాల కోసం అడ్వాన్స్ ఇచ్చినవారు అప్పులు ఇచ్చినవారు తన స్వగ్రామానికి వెళ్లగా అక్కడ సైతం ఏమి ఇల్లు, భూమి లేకపోవడం సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో అనుమానాలకు మరింత బలంగా చేగుతుంది. సదురు వ్యక్తి చేసిన అప్పులు వాహనాల పేరిట తీసుకున్న అడ్వాన్సులు చిట్టిల డబ్బులు కోటి రూపాయలకు పైనే ఉంటాయని సమాచారం ఉంది. ఎంతో నమ్మకంగా ఉండి ఒక్కసారి మోసం చేయడం బాధాకరంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

Next Story