విద్య‌, క్రీడారంగాల్లో యువ‌త‌ను ప్రోత్స‌హించ‌డ‌మే ల‌క్ష్యం : స‌ర్పంచ్ వీర‌మ‌ళ్ల శిరీష‌ లోకేష్ గౌడ్

by Nallavelli.Anjaneyulu |

యువత లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్రమశిక్షణ, అంకితభావంతో కృషి చేస్తే విజయం తప్పకుండా దరి చేరుతుందని మర్రిగూడ సర్పంచ్ వీరమళ్ళ శిరీష-లోకేష్ అన్నారు.

విద్య‌, క్రీడారంగాల్లో యువ‌త‌ను ప్రోత్స‌హించ‌డ‌మే ల‌క్ష్యం :  స‌ర్పంచ్ వీర‌మ‌ళ్ల శిరీష‌ లోకేష్ గౌడ్
X

దిశ‌, మ‌ర్రిగూడ : యువత లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్రమశిక్షణ, అంకితభావంతో కృషి చేస్తే విజయం తప్పకుండా దరి చేరుతుందని మర్రిగూడ సర్పంచ్ వీరమళ్ళ శిరీష-లోకేష్ అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలో ఎంపీఎల్ క్రికెట్ టోర్న‌మెంట్ నిర్వ‌హించారు. దాదాపు 10 టీమ్ లు పోటీలో పాల్గొన్నాయి. అయితే సోమ‌వారం రోజు ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. ముగింపు కార్య‌క్ర‌మానికి స‌ర్పంచ్ వీర‌మ‌ళ్ల శిరీష లోకేష్ హాజ‌రై బ‌హుమ‌తిలు అంద‌జేశారు. మొద‌టి బ‌హుమ‌తి ఎడ్ల విజ‌య్ టీమ్ కి స్పాన్స‌ర్ స‌ర్పంచ్ శిరీష లోకేష్ రూ.15, 116 తో పాటు ట్రోఫీ అంద‌జేశారు. ద్వితీయ బ‌హుమ‌తి స్పాన్స‌ర్ ఉప స‌ర్పంచ్ మ‌హేశ్వ‌రం ర‌మేష్ రూ.10,116 తో పాటు ట్రోఫీని మ‌హ్మ‌ద్ గౌస్ కి అంద‌జేసారు.

Next Story