- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శవాల మీద పేలాలు ఏరుతున్నారు.. బీఆర్ఎస్, బిజెపిలపై అద్దంకి దయాకర్ ఫైర్
బిజెపి, బీఆర్ఎస్ పార్టీల వారంతా శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా మారారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు.

దిశ, తుంగతుర్తి: బిజెపి, బీఆర్ఎస్ పార్టీల వారంతా శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా మారారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు.పాతబస్తీ మీర్ చౌక్ లో జరిగిన అగ్రి ప్రమాదంపై రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇలాంటి ప్రమాదాలను మానవీయ కోణంలో ఆలోచించాలే తప్ప దరిద్రపు రాజకీయాలకు పాల్పడరాదని సూచించారు.ఇలాంటి సమయాల్లో ప్రభుత్వానికి ప్రతిపక్షాలు కలిసి రావాల్సింది పోయి రాజకీయం చేయడం దివాలాకోరు రాజ రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు.జరిగిన ప్రమాదంపై సీఎం తక్షణమే స్పందించి తన మంత్రివర్గ సహచరాన్ని పంపి ఓదార్చడమే కాకుండా నష్టపరిహారం ప్రకటించాలని తెలిపారు.
సోమవారం ఆయన తుంగతుర్తి “దిశ”కు ఒక ప్రకటన పంపారు.ప్రమాదం అనేది అకస్మాత్తుగా జరుగుతుందే తప్ప ఎవరికి చెప్పి రాదని ఆయన బిజెపి,టిఆర్ఎస్ పార్టీలకు సూచించారు.బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కొండగట్టు ప్రాంతంలో బస్సుతో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన వారిని సీఎం కేసీఆర్ పరామర్శించారా..? అంటూ ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు.ఢిల్లీ,ఒరిస్సా,బీహార్ లలో బిజెపి పాలనలో ఎన్నో ప్రమాదాలు జరిగితే కనీసం సానుభూతి కూడా ఆ పార్టీ తెలపలేదని వివరించారు.ముఖ్యంగా కుంభమేళాతో పాటు పలు ప్రాంతాలలో రైల్వే ప్రమాదాలు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని గుర్తు చేశారు.ప్రపంచ వేదికలపై తెలంగాణ క్యాతిని పెంచే మిస్ వరల్డ్ పోటీల తేదీలు గతంలోనే ఖరారు అయితే దానిపై కూడా రాజకీయాలు చేయడం సమంజసం కాదని అన్నారు.






