నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్..

by Disha Web Desk 20 |
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్..
X

దిశ, నల్లగొండ : మునుగోడు ఎస్సై.సతీష్ రెడ్డి అలాగే సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో మునుగోడు బస్ స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కనపడగా వారి వద్దకు వెళ్ళి తనిఖీ చశారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల వద్ద ఎటువంటి బిల్ లేకుండా పత్తివిత్తనాల ప్యాకెట్లు ఉన్నాయి. దీంతో పోలీసులు వెంటనే వ్యవసాయ అధికారులను పిలిపించి చెక్ చేయించగా అవి నకిలీ విత్తనాలని తేలింది. దీంతో పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుండి 8 క్వింటాల 45 కిలోల ముడి పత్తి విత్తనాలు, 444 ప్యాకెట్లు 2 క్వింటాలు విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు దాదాపు 10 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

ఆంద్ర ప్రదేశ్ రాష్టానికి చెందిన కర్నాటి మధుసూదన్ రెడ్డి, గురిజాల వీర బాబు, వీరు గత కొంత కాలంగా నంద్యాల పరిసర ప్రాంతాలలో రైతుల వద్ద నుండి తక్కువ ధరకు పత్తివిత్తనాలు కొని గుంటూర్ కు తరలించి అక్కడ హరికృష్ణ రెడ్డికి చెందిన పాత మిల్లు నందు వీర బాబుతో కలిసి ప్రాసెస్ చేసి తమ వద్ద ఉన్నటువంటి గుర్తింపు లేని మేఘనా, అరుణోదయ పేరుతో పది ఫ్యాకెట్లలో ఫ్యాక్ చేసి గుంటూరు నుండి మునుగోడుకు తీసుకొని వచ్చి ఇక్కడ రైతులకు, డీలర్ లకు చూపించి అమ్మటానికి రాగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వీరు చెప్పిన వివరాల మేరకు హరి కృష్ణా రెడ్డికి చెందిన పాతమిల్లు నుండి మిగిలిన నకిలీ విత్తనాలను స్వాదీనం చేసుకుని నిందితులను రిమాండుకు పంపించారని తెలిపారు. గతంలో కర్నాటి మధుసూదన్ రెడ్డి పై నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబడి రెండు సార్లు పీ.డీ ఆక్ట్ నమోదు చేసి జైలుకి వెళ్ళి వచ్చారు. ఈ కేసులో నిందితులను పట్టుకున్న పోలీస్ బృందాన్ని నల్లగొండ డీఎస్పీ ఆద్వర్యంలో చండూర్ సీఐ అశోక్ రెడ్డి, మునుగోడు ఎస్సై సతీష్ రెడ్డి, కట్టంగూర్ ఎస్సై విజయ్, సిబ్బంది నాగరాజు, రామ నరసింహ, ఎస్పీ కె.అపూర్వరావు అభిందిచినారు.


Next Story