- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
నల్లగొండ జిల్లాకేంద్రంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ ని అతి దారుణంగా హతమార్చిన కేసులో నిందితులకు నల్లగొండ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనికి సబంధించిన వివరాలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం వెల్లడించారు.

దిశ, నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లాకేంద్రంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ ని అతి దారుణంగా హతమార్చిన కేసులో నిందితులకు నల్లగొండ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనికి సబంధించిన వివరాలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం వెల్లడించారు. కనగల్ మండల కేంద్రానికి చెందిన పాలకూరి రమేష్ (30) నల్లగొండలో ట్రాక్టర్ డ్రైవర్ పని చేస్తూ జీవిస్తున్ననాడు. మొహమ్మద్ మొసిన్ ఖాన్, మొహమ్మద్ దుర్వేశ్ మొహియుద్దీన్ కు పాలకూరి రమేష్ కు గతంలో వ్యక్తిగతంగా పాత విభేదాలు ఉండేవి. వీటిని మనసులో పెట్టుకుని జనవరి 28, 2018న రమేశ్ బైక్ ఎక్కించుకుని వెళ్లి రాత్రి 10గంటల సమయంలో అతిదారుణంగా హతమార్చారు. తల మొండెం వేరుచేసి వేర్వేరుగా ప్రాంతాల్లో పడేశారు.
మరుసటి రోజు మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. మొసిన్ ఖాన్, దుర్వేశ్ మొహియుద్దీన్ ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరపరిచారు. అప్పటి నుంచి కోర్టులో వాయిదాలపై నడుస్తూ బుధవారం ఫైనల్ కు వచ్చింది. ఎస్సీ/ఎస్టీ చట్టా కేసుల విచారణ కోర్టు– II అదనపు జిల్లా న్యాయమూర్తి రోజారమణి కేసు పూర్వపరాలను పరిశీలించి దోషులకు జీవిత ఖైదు, రూ.1వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా 6నెలల సాదా కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కేసులో నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్-I ఆర్.అఖిల, అప్పటి దర్యాప్తు అధికారులుగా ఎస్ఐ మధు, సీఐలు వెంకటేశ్వర్లు, మహబూబ్ బాషా, ప్రస్తుత డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్ఐ వై సైదులు, సీడీఓ సుమన్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ నరేందర్, మల్లికార్జున్ లను ఎస్పీ అభినందిచారు.






