ద‌శాబ్దాలుగా మ‌ర‌మ్మ‌తుల‌కు నోచుకోని ర‌హ‌దారి

by Ratna Kumari |

మండల కేంద్రం నుంచి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లే దారి సంవ‌త్సరాల నుంచి కల్వర్టు వద్ద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి మురుగునీరు చేరడంతో రహదారి వాడకంలో లేకుండా ప్రయాణికులు రాకపోకలను నిలిపివేశారు.

ద‌శాబ్దాలుగా మ‌ర‌మ్మ‌తుల‌కు నోచుకోని ర‌హ‌దారి
X

దిశ, మర్రిగూడ : మండల కేంద్రం నుంచి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లే దారి సంవ‌త్సరాల నుంచి కల్వర్టు వద్ద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి మురుగునీరు చేరడంతో రహదారి వాడకంలో లేకుండా ప్రయాణికులు రాకపోకలను నిలిపివేశారు. రెండు దశాబ్దాల క్రితం ఈ రహదారిని మర్రిగూడ మండల కేంద్రం నుంచి వట్టిపల్లి గ్రామపంచాయతీకి వెళ్లడానికి పాత రహదారి. అలాగే మండల వ్యాప్తంగా ప్రజలు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లడం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు వెచ్చించి కల్వర్టు తో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ రహదారి మరమ్మతుకు నిధులు మంజూరు చేయకపోవడంతో రహదారి గుంతలుగా ఏర్పడి కల్వర్టు వద్ద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకల కు ఇబ్బందికరంగా ఏర్పడింది. గ్రామం నుంచి వచ్చే మురుగు నీరుతో పాటు వర్షాకాలంలో వచ్చిన నీరు ఆ కల్వర్టు గుండా వెళ్ల‌క‌పోవడంతో గుంతల్లో చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వట్టిపెళ్లికి ఎంపీడీవో కార్యాలయంతో పాటు ఉపాధి హామీ , ఉపాధి హామీ కార్యాలయం తోపాటు మండల విద్యాధికారి కార్యాలయానికి వెళ్లే వారు ఆ రోడ్డుగుంట వెళ్లకుండా ప్రక్కన ఉన్న వెంచర్ గుండా రాకపోకలు సాగిస్తున్నారు. ఏళ్లకు ఏళ్లుగా ఈ రహదారిపై రాకపోకలు నిలిచిపోయిన అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వీరమల్ల శిరీష లోకేష్ హైదరాబాద్ నుంచి సిమెంట్ గూనాలను తెప్పించి ఆ రహదారికి మరమ్మతులు చేయించారు. సర్పంచ్‌ గా ఎన్నికైన తక్కువ కాల వ్యవధిలోనే తన మార్కు చూపించి ఔరా అనిపించినా సర్పంచ్ ని గ్రామస్తులు, మండల ప్రజలు అభినందించారు.

Next Story