బైకు ఢీ కొని వ్య‌క్తి మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, కొండ‌మ‌ల్లెప‌ల్లి : బైకు ఢీ కొని వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న చిన్న అడిశ‌ర్ల‌ప‌ల్లి గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలో చోటు చేసుకుంది.

బైకు ఢీ కొని వ్య‌క్తి మృతి
X

దిశ‌, కొండ‌మ‌ల్లెప‌ల్లి : బైకు ఢీ కొని వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న చిన్న అడిశ‌ర్ల‌ప‌ల్లి గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై అజ్మీర ర‌మేష్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కొండ‌మ‌ల్లెప‌ల్లి మండ‌లం చిన్న అడిశ‌ర్ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన చ‌ట్ట‌గుట్ట రామ‌స్వామి డోజ‌ర్ డ్రైవ‌ర్ గా ప‌ని చేస్తుంటాడు. అయితే ఆదివారం రాత్రి స‌మ‌యంలో ప‌క్క‌నే ఉన్న‌టువంటి ఓ దాబా హోట‌ల్ లో భోజ‌నం చేసి తిరిగి త‌న ఇంటికి రోడ్డుఐ న‌డుస్తూ వెళ్తుండ‌గా.. చింత‌ప‌ల్లి మండ‌లం అనాజీపురం గ్రామానికి చెందిన ముదిగొండ ఆంజేయులు వెనుక నుంచి వేగంగా బైకు పై వ‌చ్చి ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర గాయాల‌పాలైన రామ‌స్వామి హైద‌రాబాద్ గాంధీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మ‌ర‌ణించాడు. మృతుని భార్య అంజ‌మ్మ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్సై అజ్మీర ర‌మేష్ తెలిపారు.

Next Story