పాలడుగులో కలకలం సృష్టించిన PDS లారీ

by Nallavelli.Anjaneyulu |

పీడీఎస్ బియ్యాన్ని రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని న‌డ‌ప‌డంతో ఆ వాహ‌నం అదుపుతప్పి బారికేడ్ల‌ను ధ్వంసం చేసిన సంఘటన బుధవారం సాయంత్రం మండలంలోని పాలడుగులో చోటుచేసుకుంది.

పాలడుగులో కలకలం సృష్టించిన PDS లారీ
X

దిశ, మోత్కూరు : పీడీఎస్ బియ్యాన్ని రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని న‌డ‌ప‌డంతో ఆ వాహ‌నం అదుపుతప్పి బారికేడ్ల‌ను ధ్వంసం చేసిన సంఘటన బుధవారం సాయంత్రం మండలంలోని పాలడుగులో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ చౌక ధరల దుకాణానికి బుధవారం మధ్యాహ్నం మోత్కూరు గోదాం నుంచి సన్న బియ్యం లోడుతో పాలడుగు రేషన్ షాప్ లో దిగుమతి చేసేందుకు తరలించే క్రమంలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ వాహనంపై అదుపు కోల్పో వడంతో పాలడుగు గ్రామ శివారులో రహదారిపై ఉన్న బారి కేడులు సుమారు అర కిలోమీటర్ ధ్వంసం అయ్యాయి. ఎట్టకేలకు లారీ రేడియేటర్ పగిలి ఇంజిన్ ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. సంఘటన జరిగే సమయంలో ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారిపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు.

Next Story