- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీధి కుక్కల దాడి..ఐదేళ్ల బాలికకు తీవ్రమైన గాయాలు
దిశ,పెన్ పహాడ్ : మండలం లో విధి కుక్కలు చెలరేగి పోతున్నాయి. ఐదేండ్ల లోపు పిల్లలనే లక్ష్యంగా చేసుకొని ప్రతాపం చూపిస్తున్నాయి.

దిశ,పెన్ పహాడ్ : మండలం లో విధి కుక్కలు చెలరేగి పోతున్నాయి. ఐదేండ్ల లోపు పిల్లలనే లక్ష్యంగా చేసుకొని ప్రతాపం చూపిస్తున్నాయి. కొంత కాలంగా వివిధ గ్రామాలల్లో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. గురువారం సాయంత్రం మండల పరిధిలోని అనంతారం గ్రామంలోగద్దల వెంకన్న కూతురు వెన్నెల(5) అనే బాలికపై దాడి చేసింది. దీంతో ఆ బాలిక మూతికి తీవ్రమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుక్కను వెంబడించడంతో ప్రాణాపాయం తప్పింది. బాలికను వెంటనే సూర్యపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామాల్లో ఇటీవల పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా స్థానిక అధికారులు ప్రజా, ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.






