- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > అమ్మ నీ ముఖానికి ముళ్ళు గుచ్చుకున్నాయ్.. తల్లి ముఖానికి గుచ్చుకున్న ముల్లులు తీస్తున్న బిడ్డ వానర
అమ్మ నీ ముఖానికి ముళ్ళు గుచ్చుకున్నాయ్.. తల్లి ముఖానికి గుచ్చుకున్న ముల్లులు తీస్తున్న బిడ్డ వానర
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం బయట చెట్టుపై ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కార్యాలయం బయట ఆహారం కోసం వెళ్లి తిరిగి వచ్చి ఓ చెట్టుపై తల్లి వానర (కోతి) కూర్చుంది. అది గమనించిన బిడ్డ వానర (కోతి) తల్లిని చూసి పరిగెత్తి తల్లి ఒడిలో కూర్చుంది.

X
దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా చివ్వేంల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం బయట చెట్టుపై ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కార్యాలయం బయట ఆహారం కోసం వెళ్లి తిరిగి వచ్చి ఓ చెట్టుపై తల్లి వానర (కోతి) కూర్చుంది. అది గమనించిన బిడ్డ వానర (కోతి) తల్లిని చూసి పరిగెత్తి తల్లి ఒడిలో కూర్చుంది. దీంతో తల్లి కోతి ముఖానికి గుచ్చుకున్న ముల్లులు చూసి, చలించిపోయిన బిడ్డ కోతి చాలాసేపు తన తల్లి ముఖంపై ఉన్న చిన్న చిన్న ముల్లులను బాధపడుతూ తీసింది. ఇది గమనించిన స్థానిక ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. తల్లి పై పిల్ల కోతి చూపించిన ప్రేమకు ఫిదా అయి తమ చరవాణిలో ఫోటోలు బంధించుకున్నారు. ఈ దృశ్యం సోమవారం దిశ కెమెరాకు చిక్కింది.
Next Story






