- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ కార్యకర్త హత్య.. ఎనిమిది మంది అరెస్ట్
మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఘర్షణలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య హత్యకు గురయ్యారు.

దిశ,నూతనకల్: మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఘర్షణలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య హత్యకు గురయ్యారు. ఏఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లిలో మంగళవారం రాత్రి జువ్వాడ వెంకటేశ్వర్ రావు ఇంటి సమీపంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబందించి మృతుడు ఉప్పుల మల్లయ్య(55) కోడలు శైలజ 4వ వార్డు మెంటర్‌గా పోటీ చేయగా ప్రత్యర్థిగా పోటీ చేసిన ఆకుల రజిత వర్గానికి చెందిన ఉప్పుల సతీష్ ,కొరవి గంగయ్య,వీరబోయినసతీష్,ఉప్పుల గంగయ్య,ఉప్పుల ఎలమంచి, వీరబోయిన లింగయ్య, కారింగుల రవీందర్,దేశసంగు అవిలయ్యలు పాత రాజకీయ వ్యక్తిగత గొడవలు మనసులో పెట్టుకొని గొడవపడి పరస్పరం కర్రలు,రాళ్ళతో కొట్టుకోగా ఉప్పుల మల్లయ్య తలకు తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు వెంటనే సూర్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరిశీలించి చనిపోయినాడు అని తెలిపినారు. హత్య కేసు ఛేదించి సమర్ధవంతంగా పని చేసిన సూర్యాపేట డిఎస్పీ ప్రసన్నకుమార్, తుంగతుర్తి సిఐ ఎ. నరసింహ రావు, నూతనకల్ ఎస్సై ఆర్. నాగరాజు పోలీసు స్టేషన్ సిబ్బందిని అభినందించారు.






