ఒకేసారి ఏడుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

by velandi.Saikiran |   (  Updated:2025-09-06 14:59:08  IST  )

విధి నిర్వహణ సమయంలో కార్యాలయం లేని వివిధ హోదాలలో పని చేస్తున్న ఉద్యోగులపై సూర్యా పేట జిల్లా కలెక్టర్ చర్యలు

ఒకేసారి ఏడుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
X

దిశ, సూర్యాపేట : విధి నిర్వహణ సమయంలో కార్యాలయం లేని వివిధ హోదాలలో పని చేస్తున్న ఉద్యోగులపై సూర్యా పేట జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. రోడ్లు, భవనాల శాఖ ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) కార్యాలయానికి చెందిన ఏడుగురు ఉద్యోగులపై ఒకేసారి సస్పెన్షన్ వేటు పడింది. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నoదలాల్ పవర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఆర్ అండ్ బీ ఈఈ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఏడుగురు అధికారులు కార్యాలయంలో లేకపోవడాన్ని గమనించారు. సదరు ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి అను మతి కూడా తీసుకోలేదని తెలిసి వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుందని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Next Story