- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక మిగిలింది రెండ్రోజులే.. ఉగాది, రంజాన్ రోజు కూడా కౌంటర్ ఓపెన్
నల్లగొండ మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సుమారు 1200 మందికి నోటీసులు పంపించగా , 600 మందికి పైగా స్పందించారు.

నల్లగొండ మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సుమారు 1200 మందికి నోటీసులు పంపించగా , 600 మందికి పైగా స్పందించారు. 68 మంది సభ్యులతో కూడిన 14 టీంలను ఏర్పాటు చేశారు. టీం వారీగా సిబ్బంది చేసిన కృషి ఫలితంగా రూ. 16.50 కోట్లు వసూలయ్యాయి. మున్సిపాలిటీ లో ఆస్తిపన్ను బకాయిలు మొత్తంగా రూ.45 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో నివాస గృహాలకు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు రూ .30 కోట్లు, ప్రభుత్వ కార్యాలయాలు రూ.15 కోట్లు రావాల్సి ఉంది.పన్ను బకాయి వసూలుకు ఇక మిగిలింది రెండు రోజులే. ఈ తక్కువ సమయంలో ఆస్తి పన్ను బకాయిలు కోట్లలో వసూలు కావాల్సిఉంది. అయితే రెండు రోజులు ఉగాది, రంజాన్ సెలవులు అయినప్పటికీ అధికారులు మాత్రం సిబ్బంది ఎవరికీ కూడా సెలవులు ఇవ్వడం లేదు. పట్టణ ప్రజలు పన్ను చెల్లింపుల కోసం కౌంటర్లు తెరిచే పెడుతున్నారు.
దిశ నల్లగొండ బ్యూరో: నల్లగొండ మున్సిపాలిటీలో పన్ను బకాయి వసూలుకు ఇక మిగిలింది రెండు రోజులే. ఈ తక్కువ సమయంలో ఆస్తి పన్ను బకాయిలు కోట్లలో వసూలు కావాల్సిఉంది. అయితే రెండు రోజులు సెలవులు అయినప్పటికీ అధికారులు మాత్రం సిబ్బంది ఎవరికీ కూడా సెలవులు ఇవ్వడం లేదు. పట్టణ ప్రజలు పన్ను చెల్లింపుల కోసం కౌంటర్లు తెరిచే పెడుతున్నారు. పూర్తిస్థాయిలో పన్ను వసూళ్లకు మున్సిపల్ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
రెండు నెలలుగా రూ.16.50 కోట్లు...
నల్గొండ మున్సిపాలిటీలో ఆస్తిపన్ను బకాయిలు మొత్తంగా రూ.45 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో నివాస గృహాలకు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు రూ .30 కోట్లు, ప్రభుత్వ కార్యాలయాలు రూ.15 కోట్లు రావాల్సి ఉంది. కానీ గత రెండు నెలలుగా సుమారు 68 మంది సభ్యులతో కూడిన 14 టీంలను మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు. టీం వారీగా సిబ్బంది చేసిన కృషి ఫలితంగా రూ. 16.50 కోట్లు వసూలు చేశారు.
ఆస్తులు జప్తుతో రూ. 6 కోట్లు..
చాలాకాలంగా ఆస్తిపన్ను బకాయిలు చెల్లించకుండా పెండింగ్లో ఉన్నాయి. దాంతో మున్సిపల్ అధికారులు తప్పని పరిస్థితులలో పన్నులు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బహిరంగ ప్రకటించారు. ఆ క్రమంలోనే సుమారు 1200 మందికి నోటీసులు పంపించగా , 600 మందికి పైగా స్పందించి సుమారు రూ.8కోట్లు చెల్లించారు.
90శాతం వడ్డీ మాఫీతో.....
మున్సిపాలిటీలలో 100% ఆస్తి పన్ను వసూలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 25 వ తేదీ రాత్రి ప్రభుత్వం ఓ జీవో విడుదల చేసింది. మార్చి 31 లోపు ఆస్తి పన్ను బకాయిదారులు పూర్తిస్థాయిలో చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ ఉంటుందని ఆ జీవో ఉద్దేశం. అయితే 26వ తేదీ నుంచి ఇప్పటివరకు పట్టణంలో సుమారు రూ.2 కోట్లు ఆస్తి పన్ను పెండింగ్ బకాయిలు వసూలు అయ్యాయి.
పండుగ దినాల్లో కూడా కౌంటర్ ఓపెన్....
నేడు ఉగాది పండుగ, రేపు రంజాన్ పండుగ అయినప్పటికీ మున్సిపాలిటీలలో పన్ను వసూలు చేసేందుకు ఆఫీస్ తెరిచే ఉంటుంది. ఉద్యోగులకు ఎలాంటి సెలవు లేదు. పన్ను చెల్లించేందుకు అవసరమైన కౌంటర్లు సెలవు దినాల్లో కూడా కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీనిబట్టి పన్ను వసూలు కోసం మున్సిపల్ అధికారులు చేస్తున్న కృషి ఎంటో స్పష్టంగా అర్థమవుతుంది.
పన్ను చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు..
పట్టణ ప్రజలు ఆస్తిపన్ను బకాయిలు చెల్లించకపోతే చట్ట పరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. అవసరమైతే మున్సిపాలిటీ నుంచి అందుతున్న సేవలను కూడా నిలిపివేయాల్సి వస్తుంది. ప్రభుత్వం 90% వడ్డీ మాఫీ అవకాశం కల్పించింది. ప్రజలు ఉపయోగించుకోవాలి. - శివరాం రెడ్డి, రెవెన్యూ అధికారి, నల్లగొండ మున్సిపాలిటీ
పట్టణ ప్రజలు సహకరించాలి..
పెండింగ్ లో ఉన్న ఆస్తిపన్ను బకాయిలు వెంటనే చెల్లించి పట్టణ ప్రజలు సహకరించాలి. టౌన్ అభివృద్ధికి ప్రజలు ఆస్తిపన్ను రూపంలో చెల్లించే సొమ్ము ఎంతో అవసరం. పన్ను చెల్లించండి పట్టణ అభివృద్ధికి మీ తోడ్పాటును అందించండి. సయ్యద్ ముసాబ్ అహ్మద్ - మున్సిపల్ కమిషనర్ నల్లగొండ.






