నల్లగొండలో "కుర్చీ తాత" హల్చల్.. రాజకీయ నాయకుడంటే కొత్త అర్థం చెప్పిన తాత..!

by Bhanu |

పేరుగాంచిన "కుర్చీ తాత" అలియాస్ కాల పాషా నల్లగొండ జిల్లా కేంద్రంలో మళ్లీ ఒకసారి ప్రజల్లో హల్చల్ సృష్టించారు.

నల్లగొండలో కుర్చీ తాత హల్చల్.. రాజకీయ నాయకుడంటే కొత్త అర్థం చెప్పిన తాత..!
X

దిశ, నల్లగొండ: పేరుగాంచిన "కుర్చీ తాత" అలియాస్ కాల పాషా నల్లగొండ జిల్లా కేంద్రంలో మళ్లీ ఒకసారి ప్రజల్లో హల్చల్ సృష్టించారు. ఆయన వస్తుంటే చుట్టూ జనం గుంపులు కట్టగా, పలువురు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు.

కాల పాషా తనదైన శైలిలో మాట్లాడుతూ, “నల్లగొండ ప్రజలు చాలా మంచి వాళ్లు. వారి జోలికి ఎవడైనా వచ్చాడంటే.. కుర్చీ మడత పెట్టకుండా ఉండను!" అంటూ ఫైర్ అయ్యారు. అనంతరం రాజకీయ నాయకుడంటే ఏంటి అని ప్రశ్నిస్తూ.. “రాజకీయ నాయకుడు అనే పదాన్ని ఎనిమిది అక్షరాలుగా విడదీస్తే –

  • రా - రాక్షసుడు,
  • జ - జలేంద్రుడు,
  • కీ - కీచకుడు,
  • యా - యమధర్మరాజు,
  • నా - నారాయణుడు,
  • యా - యమంకింకరుడు,
  • కు - కుబేరుడు,
  • డు - డు డు బసవన్న.

ఈ ఎనిమిది కలిసి ఒక రాజకీయ నాయకుడిని తయారుచేస్తాయి!" అని తన ప్రత్యేక తత్వాన్ని వివరించారు. తనను "మంచి మంచోళ్ళు" అని పిలుస్తారని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిను కలవడానికి నల్లగొండ వచ్చానని చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో తన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించించుకోవడానికి వచ్చినట్లు తెలిపారు. "ఇంకా రెండు రోజుల్లో మంత్రిని కలిసివస్తా" అన్నారు.

మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో వినిపించిన "మీ కుర్చీని మడత పెడతా" అనే డైలాగ్ గురించి అడిగినప్పుడు, "నా పేరు చెప్పుకొని బతకని" అంటూ స్పందించారు. కాల పాషా తన హాస్యంతో, విమర్శతో, ప్రజల మనసు దోచుకుంటూనే ఉన్నారు.

Next Story