కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగిన నల్లగొండ బీజేపీ అభ్యర్ధి!

by Ramesh Goud |

పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ నల్లగొండ బీజేపీ ఎంపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు.

కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగిన నల్లగొండ బీజేపీ అభ్యర్ధి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ నల్లగొండ బీజేపీ ఎంపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. ఇప్పటివరకు లెక్కించిన ఫలితాలలో కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి భారీ అధిక్యంతో దుసుకుపోతుండగా.. బీఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల కృష్టారెడ్డి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. దీంతో బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ఉన్న శానంపూడి సైదిరెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఆయనతో పాటు బీజేపీ నేత పిల్లి రామరాజు యాదవ్ కూడా ఉన్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్ నగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా ఓటమి చవిచూసిన సైదిరెడ్డి.. నల్లగొండ పార్లమెంట్ స్థానం ఆయనకు కేటాయిస్తామని బీజేపీ హామీ ఇవ్వడంతో ఎన్నికలకు ముందే బీజేపీలో చేరారు.

Next Story