Nalgonda: నిడమనూరు ఆదర్శ పాఠశాలలో కీచక టీచర్!

by Ramesh Goud |

ఆదర్శ పాఠశాలలో(Model School) విద్యార్థినులతో(Students) సోషల్ టీచర్(Social Teacher) అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు.

Nalgonda: నిడమనూరు ఆదర్శ పాఠశాలలో కీచక టీచర్!
X

దిశ, వెబ్ డెస్క్: ఆదర్శ పాఠశాలలో(Model School) విద్యార్థినులతో(Students) సోషల్ టీచర్(Social Teacher) అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. నల్గగొండ జిల్లా(Nalgonda District) నిడమనూరు(Nidamanur) మండల కేంద్రంలో తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఆంజనేయులు అనే ఉపాద్యాయుడు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. గత కొంత కాలంగా భోదన పేరుతో బాలికలతో అసహ్యంగా మాట్లాడటం.. ఒంటిపై అనుచితంగా చేతులు వేయడం లాంటివి చేస్తున్నారని విద్యార్ధినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్జెక్టులో లేని విషయాలను తీసుకొచ్చి ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాడని, ఇవన్నీ ఎందుకు చెబుతున్నారని అడిగితే దూషిస్తున్నారని వాపోతున్నారు. కొత్త ఉపాద్యాయులు వచ్చిన నాటి నుంచి ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయని బాలికలు తెలిపారు. ఉపాధ్యాయుడు ఆంజనేయులుపై చర్యలు తీసుకొని, కొత్త సిబ్బందిని కేటాయించాలని విద్యార్థినులు కోరుతున్నారు.

Next Story