Nagoba Jatara 2025: నాగోబా జాతర గురించి తెలుసుకుంటే పూనకాలే.. గోండుల సంప్రదాయానికి ప్రతీక

by Vennela |

Nagoba Jatara 2025: నాగోబా జాతర (Nagoba Jatara)జనవరి 28వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.

Nagoba Jatara 2025: నాగోబా జాతర గురించి తెలుసుకుంటే పూనకాలే.. గోండుల సంప్రదాయానికి ప్రతీక
X

దిశ, వెబ్ డెస్క్: Nagoba Jatara 2025: నాగోబా జాతర (Nagoba Jatara)జనవరి 28వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. నేడు రాత్రి నాగోబాకు మహాపూజ మెస్రం వంశీయులు(Mesram dynasty) నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు కేస్లాపూర్(Keslapur) లో నాగోబా జాతర ఘనంగా జరుగుతుంది. ఈ జాతరకు భారీగా ఏర్పాట్లు సైతం చేసింది ప్రభుత్వం. 600 మంది పోలీసులు...100 సీసీ కెమెరాలతో భారీ భద్రత ఏర్పాట్లను చేసింది సర్కార్.

గోండుల సంప్రదాయానికి ప్రతీక ఈ నాగోబా జాతర(Nagoba Jatara). ఆదివాసీలు ఈ జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ వేదికగా జరిగే నాగోబా జాతర(Nagoba Jatara) జనవరి 28, మంగళవారం నాడు ప్రారంభం అవుతుంది. ప్రతిఏటా ఎంతో వైభవంగా నిర్వహించే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దెత్తున తరలివస్తారు.

ఏటా పుష్కమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మహా పూజలతో మెస్రం వంశస్తులు(Mesram dynasty) ఆ జాతరను ప్రారంభిస్తారు. ఈనెల 2వ తేదీన నాగోబా మహాపూజలకు నెలవంకతో శ్రీకారం చుట్టారు. 10వ తేదీన నాగోబా మహా(Nagoba maha pooja) పూజలకు అవసరమయ్యే పవిత్ర గంగాజలం కోసం పాదయాత్ర చేపట్టారు గిరిజనులు. ఈ నెల 17వ తేదీన మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కలమడుగు శివారుకు చేరుకున్నారు. అక్కడ గోదావరి(Godavari)లో హస్తిన మడుగ నుంచి పవిత్ర జలాన్ని సేకరించారు.

మహా పూజలకు నాలుగు రోజుల ముందు ఆలయ పరిసరాల్లోని మర్రిచెట్టు దగ్గరకు చేరారు. నాగోబా దేవుడికి మహా పూజలు నిర్వహించే మెస్రం వంశస్థులు(Mesram dynasty)..మండ గాజిలతో పూజలను ముగిస్తారు. ఉట్నూరు మండలంలోని శ్యాంపూర్ లో బుండుందేవ్(Bundumdev) కు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ జాతరను ప్రారంభిస్తారు. నాగోబా జాతర ఫిబ్రవరి 4వ తేదీ వరకు కొనసాగుతుంది.

కాగా నాగోబాను పామును దైవంగా భావిస్తారు. ఈ జాతరలో సర్పాలను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. గిరిజనుల సంప్రదాయ న్రుత్యాలు, సంగీతం, వేషధారణలు ఆకట్టుకుంటాయి. జాతర చివరి రోజు జరిగే దర్బార్(Durbar) లో గిరిజనులు తమ సమస్యలను అధికారుల వద్ద తీసుకెళ్తారు. పలు తెగలకు చెందిన గిరిజనులు ఈ జాతరలో ఒకచోట కలుసుకుని సామరస్యంగా జీవించాలన్న సందేశాన్ని ఇస్తారు.

ప్రక్రుతిని దైవంగా భావించిన ఈ గిరిజనులు..ఈ జాతరలో ప్రక్రుతిని పూజిస్తారు. గోదావరి నది నుంచి తీసుకువచ్చిన పవిత్ర గంగా జలంతో నాగోబా(Nagoba Jatara) దేవతను పూజిస్తారు. నాగ దైవానికి పలు రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. గిరిజనులు తమ ఎడ్ల బండ్లను అందంగా అలంకరించి పోటీలను నిర్వహిస్తారు. ఈ జాతర భారతీయ సంస్క్రుతిలోని వైవిధ్యానికి నిదర్శనమని చెప్పవచ్చు. నాగోబా జాతర(Nagoba Jatara) కేవలం ఒక పండగ మాత్రమే కాదు..గిరిజన సంస్క్రుతి, ఆచారాలు, విశ్వాసాలకు అద్దం పట్టేవేడుక. ఈ జాతరను సంరక్షించడం అంటే మన సంస్క్రతిని సంరక్షించడమే అని చెబుతుంటారు.

Next Story