- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ శక్తి ప్రదర్శనకు సిద్ధం.. యువమోర్చాతో రాంచందర్‌రావు కీలక సమావేశం
యువత శక్తిని సమర్థంగా వినియోగించి బీజేపీ విజయాన్ని సాధించాలని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills by-election) నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (N. Ramchander Rao) ఆదివారం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ యువ మోర్చా (BJP Yuva Morcha) నాయకులు, కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రచార వ్యూహంపై చర్చించడంతో పాటు, బూత్ స్థాయి కార్యకర్తల బాధ్యతలను అప్పగించారు. పార్టీ విజయానికి ప్రతి బూత్ స్థాయిలో సమన్వయంతో పనిచేయడం ఎంత ముఖ్యమో రాంచందర్‌రావు వివరించారు. యువత శక్తిని సమర్థంగా వినియోగించి బీజేపీ విజయాన్ని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పార్టీ శక్తిని మరింత బలంగా ప్రదర్శించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






