కోవర్టుల వల్లే మేం ఓడిపోయాం : మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోవర్టుల వల్లే మేం ఓడిపోయాం : మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలోనే BRS కోవర్టులు ఉన్నారని, వారివల్లే పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని అన్నారు. ఈ కోవర్టు సిస్టం లేకపోతే సర్పంచ్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిచేదని పేర్కొన్నారు. పార్టీకి నష్టం కలిగించే వారు కాంగ్రెస్‌లో ఉండే బదులు నేరుగా BRSలోకి వెళ్లిపోతే పార్టీ మరింత బలపడుతుందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్, సిద్దిపేట ప్రాంతాల్లో BRS మద్దతుదారులు ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం నేపథ్యంలో పార్టీలో అసంతృప్తి పెరిగిందని, మెదక్ పార్టీలోని కోవర్టులను గుర్తించి తొలగించాలని సూచించారు.

Next Story