అసెంబ్లీ ఎన్నికల్లో BRS ఓటమికి ఆ ముగ్గురే కారణం: మాజీ MLA కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
అసెంబ్లీ ఎన్నికల్లో BRS ఓటమికి ఆ ముగ్గురే కారణం: మాజీ MLA కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఓటర్లను ఆగం చేసిందని.. విలువైన ఓటును వెయ్యి, రెండు వేలకు అమ్ముకునే పరిస్థితి తెచ్చిందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమికి తండ్రి, కొడుకు, అల్లుడు (కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు) ముగ్గురే కారణమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని షాకింగ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోష్‌తో సత్తా చాటుతోందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీ స్థానాలు దక్కించుకుంటుందన్నారు.

కాగా, కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ విషయంలో బీఆర్ఎస్ హై కమాండ్‌తో విభేదించిన మైనంపల్లి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన కొడుకుతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ మైనంపల్లితో పాటు ఆయన కుమారుడు రోహిత్ రావుకు సైతం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. మైనంపల్లి తన సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి నుండి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలు కాగా.. ఆయన కొడుకు రోహిత్ రావు బీఆర్ఎస్ కంచుకోట అయిన మెదక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Next Story

Most Viewed