- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T Congress: మైనంపల్లి దెబ్బకు ఒక్కొక్కరుగా పార్టీకి రాంరాం.. అధిష్టానం అలర్ట్ కాకపోతే నష్టం తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్ లో మైనంపల్లి హనుమంతరావు తీరు మరోసారి చర్చనీయాశంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో (Telangana Congress) మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mainampalli Hanumantha Rao) వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆయన తీరువల్ల ఇటీవల మెదక్ కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు బీఆర్ఎస్ గూటికి చేరగ ఈ విషయం మరిచిపోకముందే తాజాగా సిద్ధిపేట జిల్లాకు చెందిన చక్రధర్ గౌడ్ (Chakradhar Goud) కాంగ్రెస్ పార్టీని వీడారు. మైనంపల్లి హనుమంతరావు తీరుపై ఆరోణలు చేస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాశంగా మారింది. అయితో ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో మరో వైపు హనుమంతరావు కారణంగా ఒక్కొక్కరు కాంగ్రెస్ కు రాంరాం చెప్పడం అధికారపార్టీలో రచ్చగా మారుతోంది. నేతల మధ్య మైనంపల్లి కోల్డ్ వార్ కు తెర లేపుతున్నారని ఇంత జరుగుతున్నా పార్టీ పెద్దలు మైనంపల్లిని కంట్రోల్ చేయలేకపోతున్నారనే విమర్శలు సైతం క్షేత్రస్థాయిలో వినిపించడం రాజకీయాన్ని ఇంట్రెస్టింగ్ గా మారుస్తున్నాయి.
మైనంపల్లికి పిచ్చిలేసింది:
చక్రధర్ గౌడ్ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు డ్యామేజ్ చేస్తాయో తెలియనప్పటికీ వెళ్తూ వెళ్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకోవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పద్ధతులే అవలంభిస్తున్నారని, ఇప్పటికిప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెడితే మెదక్ జిల్లా మొత్తం గులాబీమయం అవుతుందని, కాంగ్రెస్ పార్టీ ఒక్క సర్పంచ్ సీటు కూడా గెలవదని విమర్శించారు. సరిగ్గా ఈ వ్యాఖ్యలను ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇక చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓటమితో మైనంపల్లికి పిచ్చిలేసిందని ఆయన పార్టీకి నష్టం చేస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. మైనంపల్లి తీరుతో ఒక్కక్కరుగా నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో ఇకనైనా పార్టీ పెద్దలు చొరవ తీసుకోవాలని లేకుంటే ఆయన చర్యలు ప్రత్యర్థులకు ఆయుధంగా మారి పార్టీకి నష్టం జరుగుతుందనే ప్రచారం వినిపిస్తోంది.






