భాష‌ను భ్ర‌ష్టు ప‌ట్టించిన ఘ‌న‌త కేసీఆర్ కుటుంబానిదే.. మైనంపల్లి ఫైర్

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. నూత‌న స‌ర్పంచుల ఆత్మ‌గౌర‌వ స‌భ‌లో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ నేత‌లు కౌంటర్లు ఇస్తున్నారు.

భాష‌ను భ్ర‌ష్టు ప‌ట్టించిన ఘ‌న‌త కేసీఆర్ కుటుంబానిదే.. మైనంపల్లి ఫైర్
X

దిశ‌, వెబ్ డెస్క్: రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. నూత‌న స‌ర్పంచుల ఆత్మ‌గౌర‌వ స‌భ‌లో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ నేత‌లు కౌంటర్లు ఇస్తున్నారు. మ‌రోవైపు బీఆర్ఎస్ నేత‌ల వ్యాఖ్య‌ల‌కు కాంగ్రెస్ నేత‌లు కౌంట‌ర్ ఇస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడే భాష‌ను భ్ర‌ష్టుప‌ట్టించార‌ని అన్నారు. భాష‌ను భ్ర‌ష్టు ప‌ట్టించిన ఘ‌న‌త కేసీఆర్ కుటుంబాకే ద‌క్కుతుంద‌ని అన్నారు. తండ్రి పేరు చెప్పుకుని కేటీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది నిజం కాదా అని ప్ర‌శ్నించారు.

రేవంత్ రెడ్డి సొంత కృషితో అంచెలంచెలుగా ఎదిగార‌ని చెప్పారు. జెడ్పీటీసీగా కెరీర్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి త‌ర‌వాత ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచాడ‌ని అన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచార‌ని, ఎంపీగా కూడా ఎన్నిక‌య్యాడ‌ని చెప్పారు. అంతే కాకుండా పీసీసీ ప్రెసిడెంట్ గా సైతం రేవంత్ ఎన్నికై ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో ముఖ్య‌మంత్రి అయ్యాడ‌ని అన్నారు. ఒక‌వారం క్రితం మ‌గాడివా అని మాట్లాడింది కేటీఆర్ కాదా అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో 200 శాతం బీఆర్ఎస్ ప‌ని అయిపోయింద‌ని మైనంప‌ల్లి వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఇప్పుడు అదే ఫ్ర‌స్టేష‌న్ లో ఉండి మాట్లాడుతున్నాడ‌ని విమ‌ర్శించారు.

Next Story