'ముగ్గురితో నాభార్య ఎఫైర్'.. టెకీ సీతారాం సూసైడ్ కేసులో సంచలన విషయాలు

by Prasad Jukanti |   (  Updated:2026-04-30 07:42:40  IST  )

టెక్కీ సీతారాం ఆత్మహత్య కేసులో భార్య అక్రమ సంబంధాల చిక్కుముడి వీడింది. 19 పేజీల సూసైడ్ నోట్‌ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

ముగ్గురితో నాభార్య ఎఫైర్.. టెకీ సీతారాం సూసైడ్ కేసులో సంచలన విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడితో తన భార్య వెళ్లిపోయిందనే ఆవేదనతో ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ హుస్సేన్ సాగర్‍లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సీతారాం(36) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య రేణుక అరాచకాలకు సీతారం బలైపోయినట్లు స్పష్టం అవుతోంది. నా చావుకు నా భార్య వివాహేతర సంబంధాలే కారణం అని అనేక మందితో ఆమె అక్రమ సంబంధాలు కొనసాగించిందంటూ సీతారాం చనిపోవడానికి ముందు రాసిన 19 పేజీల సూసైడ్ లేఖ తాజాగా బయటకు వచ్చింది. ఇందులో తన భార్య సాగించిన అరాచకాలనన్నింటిని వివరించగా పోలీసులు ఆమెతో పాటు అమె లవర్లను అరెస్టు చేశారు.

ప్రైవేట్ వీడియోలు ఇన్‌స్టాలో పోస్ట్:

2018లో రేణుకతో తనకు వివాహం జరిగిందని ఆ తర్వాత జరిగిన పూర్తి వివరాలు తన లేఖలో రాసుకున్నాడు సీతారాం. రేణుక ఏడాదిన్నర సమయంలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అందులో ఒకరితో ప్రైవేట్‍గా ఉన్న సమయంలో ఆ వీడియోలను రికార్డు చేసిందని పేర్కొన్నాడు. వాటిని రమణ అనే వ్యక్తి ఇన్ స్టాగ్రామ్‍లో పోస్టు చేశాడని వాటిని చూసి నేను ఎలా తట్టుకోవాలంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వీడియోలను చూశాకే రేణుక నిజస్వరూపం ఏంటో తెలిసిందని ఆ తర్వాత తాను రేణుకకు ఎంత నచ్చజెప్పినా ఆమె వ్యవహార శైలి మారకపోగా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని పేర్కొన్నాడు. తనకు నెలకు 2 లక్షల జీతం, నా భార్యను చాలా బాగా చూసుకున్నాను. అయినా ఆమె ఇంత మందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా భార్యను గుడ్డిగా నమ్మడమే నేను చేసిన తప్పా అంటూ సీతారాం ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసులో సీతారాం రాసిన ఈ సూసైడ్ నోట్ పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది.

Next Story