నా వాళ్లే నన్ను మోసం చేశారు.. యువకుడి సెల్ఫీ సూసైడ్

by Thanuru Gopichand |   (  Updated:2026-01-27 09:32:34  IST  )

తన వాళ్లే తనను మోసం చేశారని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తూ బవలన్మరణానికి పాల్పడ్డాడు.

నా వాళ్లే నన్ను మోసం చేశారు.. యువకుడి సెల్ఫీ సూసైడ్
X

దిశ, వెబ్ డెస్క్ : తన వాళ్లే తనను మోసం చేశారని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తూ బవలన్మరణానికి పాల్పడ్డాడు. ఓ సెల్పీ వీడియో తీసుకుంటూ అందులో తన బాధను చెప్పుకున్నాడు. తల్లిదండ్రులే మోసం చేస్తే తనకింక దిక్కెవరని బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామంచ గ్రామంలో చోటు చేసుకుంది. వీడియోలో బాధితుడు నాగెళ్లి వెంకటేశ్వర్ రెడ్డి చెబుతున్న కథనం ప్రకారం కుటుంబ సభ్యులతో కలిసి తాను వ్యాపారం చేశానని.. అందుకు 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టానన్నారు. అందులో 7 లక్షల రూపాయలు పెట్టుబడి కాగా, మూడు లక్షలు అప్పు అని తెలయజేశారు. అప్పు తీర్చేయగా కుటుంబ సభ్యులతో వ్యాపార విషయమై తరచూ వివాదం తలెత్తేదన్నారు. తాము 17 లక్షలు పెట్టుబడి పెట్టామని.. అదంతా ఇచ్చిన తరువాతే దుకాణంలో కూర్చోవాలని వేధించేవారన్నారు. వారిచ్చిన దాని కంటే ఎక్కువ మొత్తం అడుగుతున్నప్పటికీ అప్పటికే 4 లక్షలను చెల్లించినట్లు పేర్కొన్నారు. సంవత్సరం సమయం ఇస్తే తిరిగి చెల్లిస్తానని చెప్పినప్పటికీ ఆ మాట వినలేదని వెంకటేశ్వర్ రెడ్డి వీడియోలో వాపోయారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములే తనను వేధింపులకు గురి చేస్తున్నారని కలత చెందారు. కుటుంబ సభ్యులు తనను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

తాను పెట్టుబడి పెట్టిన పైసలు ఇవ్వకున్నా ఫర్వాలేదు.. కానీ తాను వారి మాటలు, చేతలతో ఇబ్బంది పడాలనుకోవడం లేదని వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే తాను కట్టుకున్న భార్యకు అన్యాయం చేస్తున్నాననే ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇబ్బంది పెట్టి మరీ పెండ్లి చేశారని పేర్కొన్నారు. తన చావుకు భార్య కారణం కాదని వీడియోలో స్పష్టంగా తెలియజేశారు. తనకు పది లక్షల రూపాయలు ఇప్పించి ఆమె ఇంటి వద్ద సురక్షితంగా దింపేయాలని పోలీసులను కోరారు. పిల్లను ఇచ్చిన పెళ్లి చేసిన వారిని క్షమాపణలు కోరారు. తన భార్యకు మంచి భవిష్యత్తును ఇవ్వమని మనవి చేశారు.

తన కుటుంబ సభ్యుల సొమ్ముతో దహన సంస్కారాలు చేయొద్దని వెంకటేశ్వర్ రెడ్డి వేడుకున్నారు. అజయ్ రెడ్డి అనే తన స్నేహితుడితో చితికి నిప్పు పెట్టించాలని కోరారు. తన అస్తికలను ఉజ్జయిని మహకాళేశ్వర్ వద్దనున్న నదిలో కలపాలని ప్రార్థించారు. అందుకు తన అకౌంట్లో ఉన్న సొమ్మును వినియోగించాలన్నారు. తన ఆత్మగౌరవాన్ని కోల్పోవడం ఇష్టం లేకనే ప్రాణాలు తీసుకుంటున్నానని చెప్పి చివరిసారిగా క్షమాపణలు కోరారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంలో చూసినవారు ఆవేదనకు లోనవుతున్నారు. అయినవారే మోసం చేస్తే ఆ ఆవేదన భరించలేనిదని చెబుతున్నారు. వెంకటేశ్వర్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని.. ఆయన భార్యకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు.

Next Story