- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆమెతో నా అనుబంధం నిర్వచించలేనిది.. CM రేవంత్ ఎమోషనల్ ట్వీట్
రాఖీ పౌర్ణమి (Rakhi Purnima) పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క (Seethakka) రాఖీ కట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాఖీ పౌర్ణమి (Rakhi Purnima) పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క (Seethakka) రాఖీ కట్టారు. ఈ మేరకు ఆమె జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి రేవంత్ దంపతులతో పాటు ఆయన మనవడికి తిలకం దిద్ది రాఖీ కట్టారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా సీతక్కతో తనకు ఉన్న అనుబంధంపై ఎమోషన్ ట్వీట్ చేశారు. అక్షరాలతో రచించలేనిది.. మాటలతో నిర్వచించలేనిది సీతక్కతో తన అనుబంధమని కామెంట్ చేశారు. ప్రతి రాఖీ పౌర్ణమి నాడు.. ఆ బంధం మరింతగా వికసిస్తూనే ఉంటుందని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Next Story






